ఏ ఒక్క కేసును నిర్లక్ష్యం​ చేయలేదు: వాసిరెడ్డి

Vasireddy Padma Talks In Press Meet Over Domestic Violence Cases - Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌లో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయని దాదాపు 200లకు పైగా ఫిర్యాదులు‌ వచ్చాయని మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మా తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో అర్థిక భద్రత అనేది పెరిగిందన్నారు. చాలామంది ఆడవాళ్లు అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయారని చెప్పారు. ఆర్థిక సహాయం కోసం ఇలా అనేక రకాల ఫిర్యాదుల వచ్చాయని పేర్కొన్నారు. మా పరిధి కాదనే ఆలోచన లేకుండా ఏ ఒక్క కేసును నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఫిర్యాదులను బట్టి తగిన సహాయం చేశామన్నారు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి తారుమారు అయ్యాయి అనేదే లేదన్నారు. గృహ హింసకు సంబంధించిన కేసులన్ని కూడా కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారించామని తెలిపారు. దాదాపుగా కౌన్సెలింగ్‌ ద్వారా చాలా వరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే పరిష్కారం అందించామని చెప్పారు. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో)

ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో చాలా వరకు గృహహింస కేసులు తక్కువ నమోదయ్యాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో మద్యపానం వల్ల జరిగే గృహహింస అనేది చాలా వరకు తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా వరకు మహిళలు సంతోషంగా ఉన్నారని, అమ్మఒడి, ఇళ్ల పట్టాలు వంటి పథకాలు అందించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలంతా రాష్ట్రంలో భరోసాతో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. వారి కుటుంబంలో ఏదైన మాట అనాలి అంటేనే భయం వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉందని చెప్పారు. గ్రామ సచివాలయంలో ఉన్నవారంతా కూడా  మహిళలకు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు. దిశ చట్టం అ‍మలులోకి వచ్చాక మూడు నెలల్లో 167 కేసులను చార్జీ షీట్‌ ఫైల్‌ చేశామన్నారు. అందులో 20 కేసులకు శిక్షణను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. సీఎం జగన్‌ ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఇచ్చి మహిళ సాధికారతను అందించారని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. (నేడు 12 దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top