మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బీరు సీసాతో భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది.
బీరు సీసాతో భార్యపై దాడి చికిత్స పొందుతూ మృతి
దుత్తలూరు/కావలి అర్బన్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బీరు సీసాతో భార్యపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. దుత్తలూరు ఈతలవాగు సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగం మం డలం అన్నారెడ్డిపాళేనికి చెందిన ఈగ మ ణి, ప్రభావతమ్మ(38) దంపతులు. వీరు ముత్తరాశిపల్లికి చెందిన ఓ వ్యక్తి మినుము పంటకు కాపలాదారులుగా ఉంటున్నారు. వీరితో పాటు ప్రభావతమ్మకు సోదరుడి వరుసైన శేషాద్రి కుటుంబం కూడా అక్కడే ఉంటోంది. మణి దంపతులు నెల క్రితం స్వగ్రామం వెళ్లిపోయారు.
పొలం యజ మాని వద్ద రూ.10 వేలు అడ్వాన్సు తీసుకుని ఉండటంతో వారిని తీసుకురావాలని ఆయన శేష్రాదిని పంపడంతో సోమవారం తిరిగి దుత్తలూరు వచ్చారు. రాత్రి 10 గం టల సమయంతో శేషాద్రితో కలిసి కాలినడకన దుత్తలూరు సెంటర్ నుంచి పొలానికి బయలుదేరారు. అప్పటికే పూటుగా మ ద్యం సేవించివున్న మణి తన వెంట మరో బీరు సీసా తెచ్చుకున్నాడు. ఈతలవాగు స మీపంలో దాంతో ప్రభావతమ్మ తలపై దాడి చేశాడు.
రక్తస్రావమవడంతో ఆమె రోడ్డుపక్కన పడిపోయింది. పక్కనే ఉన్న శే షాద్రి భయంతో దుత్తలూరు సెంటర్‌కు ప రుగులు తీసి పోలీసులకు సమాచారం ఇ చ్చాడు. ఎస్సై సైదులు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలై పొలాల్లో పడివున్న ప్రభావతమ్మను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మంగళవా రం తెల్లవారుజామున మృతిచెందింది.
గతంలోనూ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జ రుగుతుండేవని, అనుమానిస్తూ వేధిస్తుండేవాడని, ఈ కారణంతోనే ఆమెను చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృ తురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కో సం గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయగిరి సీఐ విజయభాస్కర్, ఎస్సై సైదులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.