మద్యం మత్తులో కిరాతకం | Under the influence of alcohol brutal | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కిరాతకం

Sep 29 2014 3:08 AM | Updated on Jul 29 2019 5:43 PM

మద్యం మత్తులో కిరాతకం - Sakshi

మద్యం మత్తులో కిరాతకం

సూళ్లూరుపేట: అప్పటికే మత్తులో ఊగుతున్న ఓ వ్యక్తి మరింత మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చిన ఉదంతమిది.

భార్యను హతమార్చిన భర్త
 సూళ్లూరుపేట: అప్పటికే మత్తులో ఊగుతున్న ఓ వ్యక్తి మరింత మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చిన ఉదంతమిది. సూళ్లూరుపేటలోని గాండ్లవీధిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆదివారం ఉదయం పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసుల కథనం మేరకు..గాజుల వ్యా పారం చేసుకునే రేఖ(43)కు వాటంబేటి వెంకటేశ్వర్లుతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. బజారులోని వెంకటేశ్వర్లు సోదరుడికి చెందిన గాజుల దుకాణంలో వీరి పిల్లలందరూ పనిచేస్తారు. రేఖ మార్కెట్‌లో ప్లాట్‌ఫామ్‌పై గాజుల వ్యా పారం చేస్తోంది. శనివారం మద్యం తా గేందుకు డబ్బులు ఇవ్వమని రేఖను వెంకటేశ్వర్లు వేధించాడు. మధ్యాహ్నం పిల్లలందరూ దుకాణానికి వెళ్లిపోయారు. అ నంతరం డబ్బులు ఇవ్వలేదనే కోపంతో అప్పటికే మ ద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వ ర్లు భార్యపై రోకలితో దాడి చేశా డు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి పరారయ్యా డు. రాత్రి పిల్లలు ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో ఉంది. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చి కిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. మృతురాలి చిన్న కుమార్తె నుంచి ఫిర్యాదు తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై జి.గంగాధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement