మెడికల్ కాలేజీలో ర్యాగింగ్: ఇద్దరు విద్యార్థులు సస్పెన్షన్ | Two medicos suspension in Kakatiya Medical College due to Ragging | Sakshi
Sakshi News home page

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్: ఇద్దరు విద్యార్థులు సస్పెన్షన్

Feb 28 2014 1:21 PM | Updated on Aug 25 2018 6:13 PM

వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం జడలు విప్పుకుంది.

వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం జడలు విప్పుకుంది. కాలేజీలో కొత్తగా ప్రవేశం పొందిన వైద్య విద్యార్థిపై అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం కళాశాలలో జూనియర్ విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. దాంతో సీనియర్ విద్యార్థులపై సదరు విద్యార్థి కాలేజీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. 

 

ఆ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. జూనియర్ విద్యార్థిపై ఫైనలియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన సంఘటన వాస్తవమేనని నివేదిక ధృవీకరించింది. దాంతో ఫైనలియర్ ఇద్దరు విద్యార్థులను ఆరు నెలలపాటు కళాశాల నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రిన్సిపల్ శుక్రవారం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement