లారీ- బైక్ ఢీ.. ఇద్దరి మృతి | two killed in a Larry - motorcycle collided | Sakshi
Sakshi News home page

లారీ- బైక్ ఢీ.. ఇద్దరి మృతి

Nov 28 2015 4:42 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింన ఘటనలో బైక్ పై ఉన్న భార్యా భర్తలు మృతిచెందగా.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

వేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింన ఘటనలో బైక్ పై ఉన్న భార్యా భర్తలు మృతిచెందగా.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం నట్టయ్యపాలెం క్రాస్ రోడ్డు వద్ద శనివారం చోటుచేసుకుంది.

వివరాలు.. పెందుర్తి మండలం సుజాత నగర్‌కు చెందిన దన్నిన రమణ(31) ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు.  ఇతనికి భార్య మేనకతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు పడమట మండలంలోని జాజులవాని పాలెం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న వీరిని గాజువాక మండలం నట్టయ్యపాలెం సమీపంలో 5వ నంబరు జాతీయ రహదారి పై నుంచి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మేనక(28) అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు.

ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణ మృతి చెందగా.. ఇద్దరు చిన్నారులు కుందన(2) లత్విక్(6నెలలు) ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం చిన్నారి కుందన పుట్టిన రోజు కావడంతో.. అమ్మమ్మ ఆశిస్సుల కోసం వెళ్లి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement