'సీమలో ఇద్దరు సీఎంలు' | Two CMs in Rayalaseema, says YSR Congress party MLAs | Sakshi
Sakshi News home page

'సీమలో ఇద్దరు సీఎంలు'

Jul 6 2014 2:54 PM | Updated on Apr 4 2019 4:46 PM

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడగు ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రఘురాంరెడ్డి, అంజాద్ బాషాలు జిల్లా కలెక్టర్ను కోరారు.

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడగు ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రఘురాంరెడ్డి, అంజాద్ బాషాలు జిల్లా కలెక్టర్ను కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్ను కలసి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా జమ్మలమడుగులో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు.

 

అనంతరం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జమ్మలమడుగులో కోరం ఉన్నా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అలాగే జమ్మలమడుగులో 144 సెక్షన్ విధించిన టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రాయలసీమలో ఇద్దరు సీఎంలు ఉన్నారని అన్నారు. వారిలో ఒకరు సీఎం చంద్రబాబు కాగా, మరోకరు సీఎం రమేష్ అని వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement