ఈనెల 19న భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తాం: ఏపీఎస్‌ఆర్టీసీ

TSRTC Strike APS RTC Supports Telangana RTC Strike - Sakshi

సాక్షి, విజయవాడ: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ దామోదరరావు వెల్లడించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 19న ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. సమ్మెపై ఈ నెల 19న ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమావేశమై భవిష్యత్‌ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని.. అవసరమైతే.. దేశవ్యాప్తంగా ఉన్న రవాణా రంగం కార్మికులను అందరిని ఉద్యమానికి సన్నద్ధం చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్‌ సుందరయ్య, వరహాల్‌ నాయుడు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top