తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదు అని ఆయన అన్నారు.
రాజ్యసభ సీట్లు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది అని జూపల్లి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యమ పార్టీపై విమర్శలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని జూపల్లి హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆత్మగౌరవ యాత్రలో టీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలకు సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే చంద్రబాబుపై జూపల్లి మాటల దాడిని ఉధృతం చేసినట్టు తెలుస్తోంది.