breaking news
Joopalli Krishna Rao
-
దొంగలుపడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది
-
ఖమ్మం వైపు చూస్తున్న రాష్ట్ర రాజకీయాలు
-
పొంగులేటి,జూపల్లికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్
-
పారిశ్రామిక విప్లవం దిశగా తెలంగాణ: మంత్రి జూపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక విప్లవం సాధన దిశగా సాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన సచివాలయంలో ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ పార్లమెంటరీ కార్యదర్శి, ఎంపీ హాన్ స్టీవెన్ సియోబోతో భేటీ అయ్యారు. పారిశ్రామికీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఉన్నాయని ఆస్ట్రేలియన్ ప్రతినిధి బృందం వ్యాఖ్యానించింది. గనులు, వ్యవసాయం, నీటి యాజమాన్యం తదితర రంగాల్లో ప్రావీణ్యత కలిగిన ఆస్ట్రేలియాకు తెలంగాణలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని సియోబో అభిప్రాయం వ్యక్తం చేశారు. సూక్ష్మ సేద్యం, మౌళిక సౌకర్యాలు, విద్య, రోడ్డు భద్రత తదితర అంశాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఏర్పరుచుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, వివిధ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి తదితర అంశాలను ఆస్ట్రేలియన్ బృందానికి జూపల్లి ఈ సందర్భంగా వివరించారు. భౌగోళికంగా హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలను వివరించడంతో పాటు, ఎగుమతులు, రవాణాకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భూ విలువ తక్కువగా ఉందన్నారు. -
రాజ్యసభ సీట్లు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది: జూపల్లి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదు అని ఆయన అన్నారు. రాజ్యసభ సీట్లు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది అని జూపల్లి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యమ పార్టీపై విమర్శలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని జూపల్లి హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతంలో ఆత్మగౌరవ యాత్రలో టీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలకు సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే చంద్రబాబుపై జూపల్లి మాటల దాడిని ఉధృతం చేసినట్టు తెలుస్తోంది.