రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెదఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం ఉదయం గన్నవరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
గన్నవరం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెదఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం ఉదయం గన్నవరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారికి ఈనెల 24వ తేదీ వరకూ న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా అంతకు ముందు సీపీ ....అయిదు గంటల పాటు నిందితులను విచారించారు.
మూడు హత్యల కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో కమిషనరేట్కు తీసుకు వచ్చారు. గత నెల 24న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే.