విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ గిరిజన పాఠశాలలో వసతుల లేమిపై డిప్యూటీ డెరైక్టర్ చేసిన విచారణ తూతూ మంత్రంగా సాగిందంటూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
పార్వతీపురం (విజయనగరం) : విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ గిరిజన పాఠశాలలో వసతుల లేమిపై డిప్యూటీ డెరైక్టర్ చేసిన విచారణ తూతూ మంత్రంగా సాగిందంటూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాఠశాలలో వసతులు సరిగ్గా లేవంటూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేశారు.
దీనిపై స్పందించిన ఐటీడీఏ పీవో విచారణకు ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించిన డీడీ అసంపూర్తిగా నివేదిక రూపొందించారంటూ మంగళవారం గిరిజన సంఘాలు ధర్నా చేపట్టాయి. పాఠశాలలో అసౌకర్యాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పీవోను డిమాండ్ చేశాయి.