మనస్తాపంతో పొగాకు రైతు మృతి | tobacco farmer suicides in ongole district | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో పొగాకు రైతు మృతి

Jul 8 2015 6:33 PM | Updated on Sep 3 2017 5:08 AM

పండించిన పొగాకు ధరలు పడిపోవటంతో తీవ్ర ఆందోళన చెందిన రైతు గుండెపోటుతో మృతిచెందారు.

టంగుటూరు (ప్రకాశం): పండించిన పొగాకు ధరలు పడిపోవటంతో తీవ్ర ఆందోళన చెందిన రైతు గుండెపోటుతో మృతిచెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలంలో బుధవారం జరిగింది. వివరాలు.. మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన దళిత రైతు మిడసల కొండలరావు (55) పదెకరాల్లో పొగాకు వేశారు.

బుధవారం ఉదయం టంగుటూరులోని వేలం కేంద్రానికి పొగాకు తీసుకుని వేలం పాటకు హాజరయ్యాడు. అయితే, గిట్టుబాటు ధర లభించే పరిస్థితి కనిపించకపోవటంతో కొండలరావు తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో అక్కడే కుప్పకూలి చనిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement