
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా మార్చి నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 5 నుంచి 9వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
మార్చి 5న శ్రీ కులశేఖర ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం
మార్చి 9న కుమారధార తీర్థ ముక్కోటి
మార్చి 10న లక్ష్మీ జయంతి
మార్చి 21న శ్రీ అన్నమాచార్య వర్ధంతి
మార్చి 25న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం