తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు.
స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఉప్పుతల శరణువల్లి(15), ఆది వైష్ణవి(14), అత్తులూరి నాగ సంజన(14)లు మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన వీరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.