వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎ స్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎ స్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలోని జయభారత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముదివర్తికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కొండూరు వెంకటసుబ్బారెడ్డిని మంగళవారం కాకాణి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన నాయకుడు వెంటసుబ్బారెడ్డిపై రెండోసారి హత్యాయత్నం జరిగిందన్నారు. వెంకటసుబ్బారెడ్డిపై హత్మాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాకాణితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, బత్తిన పట్టాభిరామిరెడ్డి ఉన్నారు.