రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు! | there could be heavy rains in coming 2, 3 days | Sakshi
Sakshi News home page

రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు!

Jun 12 2017 4:05 PM | Updated on Sep 5 2017 1:26 PM

రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు!

రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు!

బంగాళాఖాతం సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఊపుతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

విశాఖపట్నం: బంగాళాఖాతం సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఊపుతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాకు రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర కోస్తాలోని నర్సాపూర్‌ వరకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది.

రుతుపవనాలు వేగంగా విస్తరించడంతో ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా వరుసగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గత రెండుమూడు రోజులుగా వానలు కురవడంతో ప్రజలు, రైతులు ఎంతో ఊరట చెందారు. తాజాగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement