కుటుంబ వ్యవస్థే సరైన సంపద: బాబు | The wealth of the family system: Babu | Sakshi
Sakshi News home page

కుటుంబ వ్యవస్థే సరైన సంపద: బాబు

Jan 18 2015 1:26 AM | Updated on Sep 2 2017 7:49 PM

భారతదేశానికి కుటుంబ వ్యవస్థే సరైన సంపదని, కుటుంబ విలువలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హితవు పలికారు.

  • ‘ఇదం కౌటిల్యం’ పుస్తకావిష్కరణ
  • సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి కుటుంబ వ్యవస్థే సరైన సంపదని, కుటుంబ విలువలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హితవు పలికారు. శనివారం హైదరాబాద్‌లో ఎమెస్కో బుక్స్, ఐ ఫోకస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్థికవేత్త కె.నరసింహమూర్తి రచించిన ‘ఇదం కౌటిల్యం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశం’లో సహజ వనరులు, మానవ వనరులు  ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థే ముఖ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కౌటిల్యుడి విధానాలతో ముందుకుపోతున్నారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు,  పుస్తక రచయిత కె.నరసింహమూర్తి, మాజీ డీజీపీ కె. అరవిందరావు, ఐ ఫోకస్ అధినేత వాసుదేవశర్మ, ఎమెస్కో చీఫ్ ఎడిటర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement