విజయనగరం జిల్లా కొమరాడ మండలం సివిని గ్రామం సమీపంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు
విజయనగరం జిల్లా కొమరాడ మండలం సివిని గ్రామం సమీపంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సివిని గ్రామానికి చెందిన వెంకట రమణ(49)గా పార్వతీపురం రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వచ్చిన అతడు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందినట్టు చెప్పారు. రమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.