
అంతర్జాతీయ స్మగ్లర్ సహా మరో ఇద్దరి అరెస్టు
కడప అర్బన్/ఓబులవారిపల్లె: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కందస్వామి వెంకటేశ్(41)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ శనివారం ఒక ్రపకటనలో తెలిపారు.
కడప అర్బన్/ఓబులవారిపల్లె: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కందస్వామి వెంకటేశ్(41)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ శనివారం ఒక ్రపకటనలో తెలిపారు. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన వెంకటేశ్ సహా అబ్దుల్ షుకూర్(40) అనే కూలీ (చెన్నై), స్కార్పియో డ్రైవర్ ముత్తుకన్నన్(37)ను సైతం అరెస్టు చేశామన్నారు. ఓబులవారిపల్లె సమీపంలోని చెన్నంరాజుపోడు వద్ద రాజంపేట ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, రైల్వేకోడూరు సీఐ హుసేన్‌పీరా, ఓబులవారిపల్లె ఎస్‌ఐ నాగరాజు శుక్రవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.6 లక్షలు విలువైన స్కార్పియో వాహనంతో పాటు రూ.1.62 లక్షలు విలువైన పది ఎర్రచందనం దుంగలు, రూ.29,950 నగదు, రెండు బంగారు ఉంగరాలు, ఒక ప్లాటినం ఉంగరం, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితులను రాజంపేట కోర్టులో హాజరు పరచగా, రిమాండుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారని ఎస్పీ తెలిపారు.