మరో రెండు రోజులు తేలికపాటి జల్లులు | The other two days, Light Showers | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులు తేలికపాటి జల్లులు

Oct 28 2013 2:37 AM | Updated on Sep 2 2017 12:02 AM

ఎడతెరిపిలేని వర్షాలు ఆదివారం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే వానముప్పు ఇంతటితోనే తొలగిపోలేదు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎడతెరిపిలేని వర్షాలు ఆదివారం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే వానముప్పు ఇంతటితోనే తొలగిపోలేదు. జిల్లాలో మరో రెండు రోజులు తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా గత ఐదు రోజుల నుంచి జనజీవనం స్తంభించిపోయింది. పల్లెలు, పట్టణాల్లో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులెదులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 
 పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా.. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 56 మండలాల్లో వర్షం కురిసింది. సగటున 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. జమ్మికుంటలో అత్యధికంగా 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హుస్నాబాద్‌లో 3.6, హుజూరాబాద్‌లో 8.8, వీణవంకలో 7.5, కమలాపూర్‌లో 8.6, ఎల్కతుర్తిలో 9.6, సైదాపూర్‌లో 5.4, భీమదేవరపల్లిలో 6.9, శ్రీరాంపూర్‌లో 3.4, ఓదెలలో 2.1, మంథనిలో 2.4, ముత్తారంలో 4.8, మల్హర్‌లో 2.8, మహదేవపూర్‌లో 5.4, కాటారంలో 3.9, మహాముత్తారంలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement