కోకాకోలాకు వందెకరాలు


ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రూ.1375 కోట్లతో ఏర్పాటు

పదేళ్లలో 3,645 మందికి ఉపాధి


విశాఖపట్నం : హిందుస్థాన్ కోకాకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం వద్ద వందెకరాలు కేటాయిస్తూ వాణిజ్యం, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోలోమన్  ఆరోక్యరాజు సోమవారం జీవో ఎంఎస్ నెం. 82ను జారీ చేశారు. రూ.1375 కోట్ల పెట్టుబడులతో ఈ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. పదేళ్ల కాలపరిమితిలో మూడు విడతల్లో 3,645 మందికి ఉపాధి కల్పించనున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఈ పాజెక్టు ఏర్పాటు కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను టెక్నికల్ కన్సల్టెంట్‌కు పంపారు.

కన్సల్టెంట్ సిఫార్సు మేరకు ఈ కంపెనీకి రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇండస్ట్రియల్ పార్కులో భూమి కేటాయిస్తూ స్టేట్ లెవల్ ల్యాండ్ ఎలాంట్ మెంట్ కమిటీలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కార్యదర్శి పేర్కొన్నారు. నిర్ణీత గడువు పదేళ్లలోగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కమిట్‌మెంట్ ప్రకారం ఉపాధి కల్పించకపోతే భూమి కేటాయింపు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేలా సబ్జెక్టు టు కండీషన్స్‌తో ల్యాండ్ ఎలాట్ చేస్తున్నామన్నారు.


 


 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top