ముగిసిన క్రీడా సంబరం

ముగిసిన క్రీడా సంబరం


రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు జరిగిన జిల్లా అంతర్ కళాశాలల ‘యువతరంగం క్రీడోత్సవాలు’ బుధవారం రాత్రి ముగిశాయి. రెండో రోజూ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన 17 కళాశాలలల విద్యార్థులు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. క్రీడాస్ఫూర్తినిచాటారు. విజేతలకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు.

 

రాజమండ్రి సిటీ : విద్యార్థులు చదువుతోపాటు ఆటలకూ ప్రాధాన్యం ఇవ్వాలని  ఉన్నతవిద్యాశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ గంగేశ్వరరావు సూచించారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన జిల్లా అంతర కళాశాలల పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఆయన బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల్లో సత్తాచాటారు. గెలుపే లక్ష్యంగా తలపడ్డారు. పోటీల్లో విజేతలు వీరే..

 

విజేతలు వీరే... పురుషల విభాగంలో..

బాడ్మింటన్‌లో విజేత అమలాపురం ఎప్‌కేబీఆర్,  రన్నర్ కాకినాడ పీఆర్‌జేసీ కాలేజ్  

* చెస్‌లో విజేత కాకినాడ పీఆర్‌జి కాలేజ్,  రన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్  

* వాలీబాల్‌లో విన్నర్ రాజమండ్రి ఎస్‌కేవీటీ కాలేజ్, రన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్

* ఖోఖోలో విన్నర్ కాకినాడ పీఆర్‌జీ కాలేజ్, రన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్  

* కబడ్డీలో విన్నర్ ఎస్‌కేవీటీ రాజమండ్రి, రన్నర్ రాజమండ్రి ఏకేసీ కాలేజ్మహిళల విభాగంలో..

* వాలీబాల్‌లో విన్నర్ రాజమండ్రి రాజ్యలక్ష్మి కాలేజీ, రన్నర్ రాజమండ్రి ఎస్‌కేవీటీ

* కబడ్డీలో విన్నర్ కాకినాడ ఏఎస్‌డీ ఉమెన్స్, రన్నర్ రాజమండ్రి జీడీసీ

* ఖోఖోలో విన్నర్ కాకినాడ ఆదిత్య కాలేజ్, రన్నర్ కాకినాడ ఏఎస్‌డీ కాలేజ్  

* బాడ్మింటన్‌లో విన్నర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, రన్నర్ కాకినాడ పీఆర్‌జీసీ కాలేజ్  

* చెస్‌లో విన్నర్ కాకినాడ ఆదిత్యకాలేజ్, రన్నర్ రాజమండ్రి జీడీసీ కాలేజ్   అథ్లెటిక్స్ పురుషుల విభాగంలో

* రన్నింగ్ 100 మిటర్ల విభాగంలో జి.ప్రసాద్, జి.వీరబాబు, యువరాజు హరీష్, 200 మీటర్ల విభాగంలో జి.ప్రసాద్, యువరాజ్ హరీష్ జి.వీరబాబు,

* 400 మీటర్ల విభాగంలో కుమార్, దుర్గాప్రసాద్, గణేష్, 800 మీటర్ల విభాగంలో రమేష్, గణేష్, రామన్నదొర, 1500 మీటర్ల విభాగంలో సూర్యతేజ, రామన్నదొర, నరేష్, 5కిలో మీటర్ల విభాగంలో రమేష్ నరేష్, దుర్గాప్రసాద్ మొదటి మూడు స్థానాలను సాధించారు.

* లాంగ్ జంప్‌లో కుమార్, నారాయణ, వేణు, హైజంప్‌లో మణికంఠ, జగ్గారావు, వేణుబాబు, షాట్‌పుట్‌లో పి.విజయకుమార్, చక్రధరరావు, వీరబాబు, డిస్కస్ త్రోలో విజయకుమార్, రాజేష్, వేణు తొలి మూడు స్థానాలు సాధించారు.

 

అథ్లెటిక్స్ మహిళల విభాగంలో

* రన్నింగ్ 100 మీటర్ల విభాగంలో దుర్గాభవానీ, పద్మ, ఉమామహేశ్వరి, 200 మీటర్ల విభాగంలో దుర్గాభవానీ, ఫణిశ్రీ, పద్మ, 400 మీటర్ల విభాగంలో ఉమామహేశ్వరి, ప్రియాంక, ప్రమీల, 800 మీటర్ల విభాగంలో ప్రియాంక, వీరల క్ష్మి, ఫణిశ్రీ, 1500 మీటర్ల విభాగంలో విజయకుమారి, దేవి, శాంతి, 3కిలో మీటర్ల విభాగంలో వనజాకుమారి, దేవి, శాంతి మొదటి మూడు స్థానాలు సాధించారు.

* లాంగ్ జంప్‌లో దుర్గాభవానీ, నారాయణమ్మ, పద్మ, హైజంప్‌లో భాగ్యలక్ష్మి, బాల, పద్మ, షాట్‌పుట్‌లో, దుర్గాభవానీ, వరల క్ష్మి, కృష్ణవేణి, డిస్కస్‌త్రో విభాగంలో దుర్గాభవానీ, కృష్ణవేణి, మహాల క్ష్మి తొలి మూడు స్థానాలు సాధించారు.

 

కబడ్డీ విజేత ప్రకటనపై రగడ

పిఠాపురం క్రీడాకారుల ఆవేదన

కబడ్డీ జేత ప్రకటనలో నెలకొన్న గందరగోళం రగడకు దారితీసింది. తమ కళాశాల క్రీడాకారులకు అన్యాయం చేశారని పిఠాపురం డిగ్రీ కళాశాల డిప్యూటీ ప్రిన్సిపాల్, ఇన్‌చార్జి పీడీ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.  బుధవారం జరిగిన కబడ్డీ సెమీ ఫైనల్స్‌లో రాజమండ్రి ఎస్‌కేవీటీ, పిఠాపురం డిగ్రీ కాలేజ్‌ల మధ్య పోరు సాగింది. ఓ దశలో పిఠాపురం జట్టు 39 పాయింట్లతో గెలుపొందిందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఎస్‌కేవీటీ క్రీడాకారులు, స్థానికులు అభ్యంతరం తెలపడంతో నిర్వాహకులు ఇంకా ఆట పూర్తికాలేదని వెల్లడించారు.దీంతో పిఠాపురం క్రీడాకారులు ఆందోళన చేశారు. స్థానికులు చుట్టుముట్టడంతో ఒత్తిడికి లోనై నిర్వాహకులు ఆట పూర్తికాలేదని చెప్పారని పిఠాపురం కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారావు, కెప్టెన్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్కోర్ బోర్డులను మార్చేశారని ఆరోపించారు.  ఈ విషయంపై ఉన్నతవిద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని కృష్ణారావు పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సరైన వసతులు కల్పించలేదని  టెక్నికల్ కమిటి ఏర్పాటు చేయలేదని విమర్శించారు.ఈవిషయమై క్రీడల జిల్లా కో-ఆర్డినేటర్ అమ్మన్నచౌదరిని  వివరణ కోరగా రాజమండ్రి-పిఠాపురం జట్లు 38-38 పాయింట్లు సాధించాయని, స్కోరర్ రాజమండ్రికి వేయాల్చిన పాయింటును పిఠాపురానికి వేశారని, దీంతో  పిఠాపురం గెలిచినట్లు ముందు ప్రకటించారని, అయితే వెంటనే తప్పును గ్రహించి విషయాన్ని పిఠాపురం విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశామని  వివరించారు. టెక్నికల్ కమిటీకి కూడా నివేదించామని  డ్రాగా ప్రకటి స్తామని లేదా మళ్లీ ఆట ఆడాలని సూచించామని, అయితే వారు వినలేదని, వెళ్లిపోయారని వెల్లడించారు. దీంతో విజేతగా ఎస్‌కేవీటీని ప్రకటించామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top