సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో మృతురాలు దీప్తి తల్లిదండ్రులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది
గుంటూరు, సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో మృతురాలు దీప్తి తల్లిదండ్రులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించి కుమార్తె దీప్తిని కడతేర్చడం విదితమే.
కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం దీప్తి తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, దీప్తి మృతదేహానికి సోమవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త కిరణ్‌కుమార్, కుటుంబసభ్యులు మృతదేహాన్ని తమకుఅప్పగించాలని కోరారు. దీప్తి బంధువులు మృతదేహాన్ని తమకే అప్పగించాలని పట్టుపట్టడంతో ఇరువర్గాలమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని దీప్తి తరఫు బంధువులకే అప్పగించేందుకు నిర్ణయించారు