నవ భాషల్లో నటించినా.. తెలుగే సంతృప్తి

Telugu Actor Suman Attended A Function In Ongole - Sakshi

సాక్షి,ఒంగోలు : తొమ్మిది భాషల్లో నటించినా ‘తెలుగు‘ భాషే సంతృప్తినిచ్చిందని ప్రముఖ సినీనటుడు సుమన్‌ పేర్కొన్నారు. ఒంగోలులో ఒక కార్యాక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుమన్‌ తన సినీ ప్రస్థానంపై ‘సాక్షి’తో ముచ్చటించారు. 

తెలుగు పరిశ్రమ అక్కున చేర్చుకుంది
40 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నా. 9 భాషల్లో నటించా. కానీ తెలుగు చిత్రసీమ ఎక్కువగా నన్ను ఆదరించింది. పాత, కొత్త నిర్మాతలు, దర్శకులతో చేసిన అనుభవం నాది. హీరో, విలన్, ఉప కథానాయకుడిగా అనేక పాత్రలు ఇచ్చి తెలుగు సినీరంగం నన్ను అక్కున చేర్చుకుంది. 

సెంచరీకి ‘సినిమా’ దూరంలో..
ఇప్పటికి తొమ్మిది భాషల్లో 99 సినిమాలు చేశా. ఇంకో సినిమా చేస్తే వంద సినిమాలు పూర్తవుతాయి. నా జర్నీ సంతృప్తికరంగానే  సాగుతోంది.

రాష్ట్ర విభజనతో నష్టం లేదు
రాష్ట్ర విభజన వల్ల ఏమీ నష్టం జరగలేదు. ఇంకా మంచే జరిగింది. అయితే, విశాఖకు సినీ పరిశ్రమ తరలితే ఇంకా బాగుంటుంది. ఇప్పటికే గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలో సినిమా షూటింగ్‌లు బాగానే జరుగుతున్నాయి.  

చదవండి : బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top