కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అయిన తెలంగాణ ప్రాంత మంత్రులు.... బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ : కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అయిన తెలంగాణ ప్రాంత మంత్రులు.... బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరసన తెలిపి వాకౌట్ చేయాలని వారు నిర్ణయించారు. మంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. మరోవైపు అసెంబ్లీలో ఉండి కూడా కేబినెట్ భేటీకి మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ హాజరు కాలేదు.