జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి | TDP Leaders Join In YSRCP Chittoor | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి

Jan 24 2019 11:47 AM | Updated on Jan 24 2019 11:47 AM

TDP Leaders Join In YSRCP Chittoor - Sakshi

ఎమ్మెల్యే రోజా సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు

చిత్తూరు, విజయపురం: జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. మండలంలోని పన్నూరు, శ్రీహరిపురం, నార్పరాజుకండ్రిగ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మీపతి రాజు ఆధ్వర్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకిలో చేరారు. వీరికి ఎమ్మెల్యే రోజా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర, నవరత్నాల పథకాలను చూసి పార్టీలో చేరుతున్నామని అన్నారు. టీడీపీలో పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు లేదన్నారు. దొంగతనం, మోసాలు చేసే వారికి గుర్తింపు ఇస్తారని విమర్శించారు. ఎవరూ చేయని విధంగా ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తన సొంత నిధులతో పేద ప్రజలకు రూ.4కే అన్నం, రూ.2కే మంచి నీరు, పాఠశాలలకు ఉచితంగా ఫ్యాన్లు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. ఆమె మంచితనం చూసి వైఎస్సార్‌సీపీలో చేరామని, పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారు పద్మనాభరెడ్డి, కిషోర్‌రెడ్డి, హేమాద్రి, సూర్య, జగ, కుమార్‌ ఆచారి, దేవయాని, చిన్నబ్బతో పాటు 100 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement