తమ సమస్యలు పరిష్కరించి ఇబ్బందులు తీర్చాలని అడిగిన ప్రజలను, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను పచ్చ తమ్ముళ్లు సహించలేకపోయారు.
పార్వతీపురం (విజయనగరం) : తమ సమస్యలు పరిష్కరించి ఇబ్బందులు తీర్చాలని అడిగిన ప్రజలను, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను పచ్చ తమ్ముళ్లు సహించలేకపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురం 30వ వార్డులో సోమవారం జన్మభూమి ముగింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారికి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత జగదీశ్ నేతృత్వంలో నాయకులు మద్దతుగా నిలిచారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు వారందరినీ బయటకు బలవంతంగా పంపించేశారు. మొత్తం 45 నిముషాల్లోనే సభ ముగిసిందని ప్రకటించారు. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజలు తీవ్రంగా నిరసించారు.