
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : కేబుల్ వ్యవస్థను ప్రభుత్వంలో అంతర్భాగం చేయాలని ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన సంఘ సభ్యులు కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అసంఘటిత రంగం కింద తమను కూడా చేర్చాలని, కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్లకు ఐదు లక్షల రూపాయల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 15లో ఉన్న పోల్ ట్యాక్స్ నుంచి కేబుల్ ఆపరేటర్లను మినహాయించాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలను ఎన్నిసార్లు దృష్టికి తెచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.