స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సన్నిధివీధి, జయరామరావు పార్కు, దుర్గమ్మకొండ, నీటిపారుదలశాఖ కార్యాలయం మీదుగా నాయుడుపేట రోడ్డును....
- రూ.4కోట్లతో భరధ్వాజతీర్థం రోడ్డు
- చెన్నై తరహాలో టాయిలెట్స్
- తిరుమలలోలాగా నిత్య అన్నదానం
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
	శ్రీకాళహస్తి : స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సన్నిధివీధి, జయరామరావు పార్కు, దుర్గమ్మకొండ, నీటిపారుదలశాఖ కార్యాలయం మీదుగా నాయుడుపేట రోడ్డును కలుపుతూ రూ.10 కోట్లతో నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జ ల గోపాలకృష్ణారెడ్డి సూచనల మేరకు ఆలయ ఇన్‌చార్జి ఈవో శ్రీనివాసరావు గురువారం పలు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఆలయాధికారులతో తన చాంబర్‌లో సమావేశమయ్యూరు.
	
	ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమిం చడంతో పాటు భక్తుల సౌకర్యం కోసం స్వర్ణముఖినది అంచున రూ.10 కోట్లతో రోడ్డు ఏర్పాటు చేయడానికి నిర్ణరుుం చారు. భరధ్వాజ తీర్థం మీదుగా 60అడుగుల రోడ్డున రూ.4కోట్లతో కైలాసగిరికొండ అవతలివైపు ఉన్న ఆలయభూముల్లోకి రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతంలో సత్రాలు, వసతిగృహాలు నిర్మించడానికి ముందుగా రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రూ.30 లక్షలతో చెన్నై తరహాలో పన్నెండు టాయిలెట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.
	
	తిరుమల తరహాలో నిత్యం అన్నదానం,ఉచిత ప్రసాదాలు అందజేయలనే ఆలోచనతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్వామివారి సన్నిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి రాగిరేకును అమర్చడానికి తీర్మానం చేశారు. ఆలయానికి చెందిన రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆలయ ఏఈవో శ్రీనివాసులురెడ్డి, ఈఈ రామిరెడ్డి, ఆలయ స్తపతి లక్ష్మీ నరసింహస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడు బాబు గురుకుల్  పాల్గొన్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
