'బాబుకు విదేశీ కన్సల్టెన్సీలపై మోజు' | sv mohan reddy slams on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబుకు విదేశీ కన్సల్టెన్సీలపై మోజు'

Feb 13 2015 4:02 PM | Updated on Jul 28 2018 6:35 PM

'బాబుకు విదేశీ కన్సల్టెన్సీలపై మోజు' - Sakshi

'బాబుకు విదేశీ కన్సల్టెన్సీలపై మోజు'

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కన్సల్టెన్సీల ప్రభుత్వమనే అనుమానం కలుగుతోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్ఎల్ఏ ఎస్వీమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కన్సల్టెన్సీల ప్రభుత్వమనే అనుమానం కలుగుతోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్ఎల్ఏ ఎస్వీమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు విదేశీ కన్సల్టెన్సీలంటే ఎందుకంత మోజో తెలియడం లేదన్నారు. మన దేశంలో నిపుణులు లేరా అని ఆయన ప్రశ్నించారు.

మంత్రులు, ఉన్నతాధికారులు నిపుణులను పక్కన పెట్టడం వారిని అవమానించడమే అన్నారు. కన్సల్టెన్సీల కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై  ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement