‘మహీంద్రా’ను సందర్శించిన ప్రిన్స్ | super star mahesh babu visited mahindhra company | Sakshi
Sakshi News home page

‘మహీంద్రా’ను సందర్శించిన ప్రిన్స్

Aug 31 2013 12:30 AM | Updated on Oct 8 2018 7:58 PM

సినీ నటుడు మహేష్‌బాబు శుక్రవారం జహీరాబాద్ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారాన్ని సందర్శించారు. మహీంద్రా ట్రాక్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందున యాజమాన్యం మహేష్‌బాబును స్థానిక ట్రాక్టర్ యూనిట్‌కు ఆహ్వానించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది.

 జహీరాబాద్, న్యూస్‌లైన్: సినీ నటుడు మహేష్‌బాబు శుక్రవారం జహీరాబాద్ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారాన్ని సందర్శించారు. మహీంద్రా ట్రాక్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందున యాజమాన్యం మహేష్‌బాబును స్థానిక ట్రాక్టర్ యూనిట్‌కు ఆహ్వానించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి ట్రాక్టర్ పనితనం గురించి తెలుసుకున్నట్టు సమాచారం. మహేష్‌బాబు రాక సందర్భంగా కర్మాగారం పరిసరాల్లోకి ఇతరులనెవ్వరినీ అనుమతించలేదు. కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement