చికిత్స పొందుతూ అత్తాకోడళ్లు మృతి | suicide attempted 2 died while they taking treatment | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ అత్తాకోడళ్లు మృతి

Aug 7 2015 4:26 PM | Updated on Sep 3 2017 6:59 AM

కుటంబ కలహాలతో కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న అత్తా కోడళ్లు మృతి చెందారు.

కర్నూలు(వెల్దుర్తి): కుటంబ కలహాలతో కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న అత్తా కోడళ్లు మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని నర్సాపురం గ్రామనికి చెందిన అత్తా, కోడళ్లు ఇంట్లో తరచూ గొడవ పడుతుండేవారు. అయితే గురువారం కూడా ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో కోడలు కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. అయితే చికిత్స పొందుతూ కోడలు మహతి మృతి చెందగా, ఈ రోజు అదే తరహాలో అత్త సుబ్బలమ్మ చికిత్స పొందతూ ప్రాణాలొదిలింది.

Advertisement
 
Advertisement
Advertisement