షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి: వైఎస్ జగన్కు రైతుల మొర | sugar cane farmers meet ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి: వైఎస్ జగన్కు రైతుల మొర

Oct 18 2014 12:20 PM | Updated on Jul 25 2018 4:07 PM

షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి: వైఎస్ జగన్కు రైతుల మొర - Sakshi

షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి: వైఎస్ జగన్కు రైతుల మొర

హుదూద్ తుఫాను కారణంగా అస్తవ్యస్తమైన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు.

హుదూద్ తుఫాను కారణంగా అస్తవ్యస్తమైన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. ఆయనను కలుసుకున్న చెరుకురైతులు.. అక్కడి షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

హుదూద్ తుఫాను కారణంగా ఫ్యాక్టరీకి బాగా నష్టం వాటిల్లిందని వాళ్లు చెప్పారు. దీన్ని కూడా సాకుగా చూపించి.. దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కార్యవర్గం పావులు కదుపుతోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వాళ్లు తెలిపారు. దీన్ని అడ్డుకోవాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement