అంతర్జాతీయ కూచిపూడి బృంద నాట్యంలో విజయనగరానికి చెందిన శ్రీవైష్ణవి కళాక్షేత్రానికి చెందిన ఐదుగురు విద్యార్థినులతో పాటు నాట్య గురువుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది.
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ కూచిపూడి బృంద నాట్యంలో విజయనగరానికి చెందిన శ్రీవైష్ణవి కళాక్షేత్రానికి చెందిన ఐదుగురు విద్యార్థినులతో పాటు నాట్య గురువుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఈ మేరకు మంగళవారం సంస్థకు ధ్రువీకరణ పత్రాలు అందినట్టు సంస్థ నిర్వాహకులు ఎ.జయలక్ష్మి తెలి పారు.
సిలికానాంధ్ర (అమెరికా)కు సంబంధించిన టీమ్ హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో 2012 డిసెంబరు 23, 24, 25 తేదీల్లో నిర్వహించిన 3వ అంతర్జాతీయ మహా బృంద నాట్యంలో విజయనగరానికి చెందిన విద్యార్థినులు ఎ.హితైషి, పి.శ్రీనిధి, డి.శ్రీ నిజ, ఎస్‌జె.సౌమ్య, సిహెచ్.సింధుజ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించారు.
వీరికి నృత్యశిక్షణ ఇచ్చిన షీలా రమణమూర్తికి నాట్య గురువుగా గిన్నిస్ రికార్డ్ లభించిందని కళాక్షేత్ర నిర్వాహకులు ఎ.జయలక్ష్మి తెలిపారు. బృంద నాట్యంలో పాలొ న్న కళాకారులకు లండన్ నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ధ్రువీకరణ పత్రాలు మంగళవారం తమకు అందాయన్నారు. 2014 డిసెంబరు లో జరిగే 4వ అంతర్జాతీ య బృందనాట్యంలో కూ డా తమ విద్యార్థులను పంపించనున్నట్టు తెలిపారు.