11 గిన్నిస్ రికార్డుల వీరుడికి సన్మానం | honor to the 11 Guinness record holder | Sakshi
Sakshi News home page

11 గిన్నిస్ రికార్డుల వీరుడికి సన్మానం

Aug 28 2016 8:26 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఒక గిన్నిస్ రికార్డు స్థాపించేందుకే ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ పడతారు.

ఒక గిన్నిస్ రికార్డు స్థాపించేందుకే ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ పడతారు. కాని మన నగరానికి చెందిన జయంత్ రెడ్డి ఒకటి కాదు, రెండు కాదు ఇప్పటివరకూ 11 గిన్నిస్ రికార్డులు స్థాపించారు. తైక్వాండోలో ఆయన రికార్డులను బద్దలు కొట్టాలంటే ఇక అసాధ్యం అనే విధంగా రికార్డులను సాధించారు.

 

అమెరికా అధ్యక్షులు ఒబామా, గత అధ్యక్షులు జార్జ్‌బుష్‌ల చేతులమీదుగా కూడా అవార్డులు అందుకున్నారు. కేవలం ఆయనే రికార్డులు స్ధాపించకుండా ఆయన శిష్యులు కూడా ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. ఇతనివద్ద ఇప్పటివరకూ 5 లక్షల మంది శిక్షణ పొందారంటే నమ్మశక్యం కాని విశయం. ఇతని శిష్యులు వందల సంఖ్యలో ఇంటర్నేషనల్ ఛాంపియన్లు ఉండగా, వేల సంఖ్యలో జాతీయ చాంపియన్లుగా నిలిచారు. ఇతని శిష్యుడు కొండా సహదేవ్ ఇప్పటికే పలు గిన్నీస్ రికార్డులు సాధించాడు. త్వరలోనే అకాడమీ స్ధాపించి తన శిష్యులను వెయ్యి మందిని గిన్నిస్ రికార్డు హోల్డర్లుగా తీర్చిదిద్దుతానని, ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెలతానని అన్నారు.


ఇటీవలే తన 55 సంవత్సరాల వయస్సులో ఎడమచేతితో ఒక్క నిమిషంలో 352 పంచ్‌లు కొట్టి గిన్నీస్ రికార్డు అందుకున్నారు. గతంలో తైక్వాండో పుట్టిన కొరియా దేశస్థుడు ఒక్క నిమిషంలో 333 పంచ్‌ల రికార్డును బద్దల కొట్టి జయంత్‌రెడ్డి మరోరికార్డు సాధించారు. 2010లో ఒక్క నిమిషంలో 171 కిక్‌లు కొట్టి గిస్నీస్ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును ఇప్పటివరకూ ఎవ్వరూ బ్రేక్ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement