నిమజ్జనంలో ఘర్షణ: ఆరుగురికి గాయాలు | six injured in ganesh nimajjanam | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో ఘర్షణ: ఆరుగురికి గాయాలు

Sep 20 2015 2:18 PM | Updated on Sep 3 2017 9:41 AM

వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుని ఆరుగురు గాయపడ్డారు.

కురబలకోట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుని ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం గంగావారిపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి రావడంతో అతణ్ని వేరే వర్గం వారు అడ్డుకున్నారు.

ఆ వివాదం కాస్త పెద్దది కావడంతో ఇరు వైపుల వారు దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement