రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదు | Seemandhra will not tolerate bifurcation: Jupudi Prabhakar | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదు

Aug 17 2013 11:21 AM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదు - Sakshi

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదు

రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు.

ఒంగోలు : రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు మంచివే అన్నారని.... అయితే ప్రజాభీష్టానికి భిన్నంగా విభజన చేయమని ఆయన చెప్పలేదని జూపూడి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

వైఎస్ విజయమ్మ దీక్ష రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందని ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని జూపూడి తెలిపారు. కాగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో 18వ రోజు బంద్ కొనసాగుతోంది. ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలతో సీమాంధ్ర జిల్లాలు హోరెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement