బావిలోపడిన ఓ విద్యార్థిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఆదిలాబాద్: బావిలోపడిన ఓ విద్యార్థిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అగ్నిమాపక వాహనం వచ్చినా అందులో జనరేటర్ పనిచేయలేదు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మణికంఠ ఉట్నూరు క్రీడా పాఠశాల బావిలో పడ్డాడు. ఆ విద్యార్థిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించింది. బావిలో నీరు తోడేందుకు ప్రయత్నించగా, ఫైర్ ఇంజన్‌లో జనరేటర్ పనిచేయలేదు.
అధికారులు వెంటనే డీజిల్ ఇంజన్‌ను తెప్పించారు. అదీ పనిచేయలేదు. అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు ఎంత కష్టపడినా చిన్నారి ప్రాణాలు దక్కలేదు. మణికంఠ మృతి చెందాడు.