కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఎస్సీ, ఎస్టీలకు చోటు దక్కకపోవడంపై ఆయా సామాజికవర్గ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లు మావి... సీట్లు వారికా?
Jan 29 2014 1:59 AM | Updated on Mar 18 2019 9:02 PM
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఎస్సీ, ఎస్టీలకు చోటు దక్కకపోవడంపై ఆయా సామాజికవర్గ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శులు ఆర్‌సీ కుంతియా, తిరునావక్కరసార్ వద్ద తమ నిరసన తెలిపారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ టిక్కెట్‌ను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ‘ఓట్లు మావి- సీట్లు అగ్ర కులాలకా?’ అంటూ నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
సోమవారం సాయంత్రం రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు కాగానే ఎస్సీ, ఎస్టీ మంత్రులు పి.బాలరాజు, కొండ్రు మురళీమోహన్, డొక్కా మాణిక్యవరప్రసాద్, జి.ప్రసాద్‌కుమార్ తదితరులు అదేరోజు రాత్రి ఏఐసీసీ కార్యదర్శులను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు. పార్టీకి సుబ్బిరామిరెడ్డి ఏం సేవ చేశారని ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులను నంది ఎల్లయ్య, రత్నాబాయిలతోగానీ ఇతర ఎస్సీ, ఎస్టీలతోగానీ భర్తీ చేస్తామని సోనియాగాంధీతో హామీ ఇప్పిస్తామని నచ్చజెప్పడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు మెత్తబడ్డారు. రాజ్యసభ అభ్యర్థులకు మద్దతిచ్చేందుకు అంగీకరించారు.
Advertisement
Advertisement