ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం టీ నోట్ ఆమోదించిన నేపథ్యంలో శుక్రవారం గుంటూరులో సమైక్యవాదులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం టీ నోట్ ఆమోదించిన నేపథ్యంలో శుక్రవారం సమైక్యవాదులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. అందులోభాగంగా ఈ రోజు ఉదయం నగరంలోని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు.
అయితే అప్పటికే మంత్రి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాంతో పోలీసులకు, సమైక్యవాదుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే శంకర విలాస్ సెంటర్ సమీపంలోని బ్రిడ్జ్పై సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై బారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.