రూ.31.50లక్షల నగదు స్వాధీనం | Rs.31.50 Lakh Cash Was Seized | Sakshi
Sakshi News home page

రూ.31.50లక్షల నగదు స్వాధీనం

Jun 21 2018 10:48 AM | Updated on Sep 27 2018 4:02 PM

Rs.31.50 Lakh Cash Was Seized - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదు, నజీర్‌ను అరెస్టు చూపుతున్న సీఐ సురేంద్రరెడ్డి 

సాక్షి, తాడిపత్రి టౌన్‌ : స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం రూ.31.50లక్షల నగదును అక్రమంగా తరలిస్తున్న తాడిపత్రి పట్టణం పతాంజలి వీధికి చెందిన నజీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగదును ఐటీ శాఖకు అప్పగించినట్లు పట్టణ సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నజీర్‌ జువెలర్స్‌ యజమాని నజీర్‌ అక్రమంగా డబ్బు తరలిస్తున్నట్లు డీఎస్పీకి వచ్చిందన్నారు. ఆ మేరకు స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం ఎస్‌ఐలు రాఘవరెడ్డి, శ్రీధర్‌ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. బంగారు షాపు యజమానిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement