కారు అద్దాలు పగలగొట్టి రూ.50 వేల చోరీ | rs.50 thousands robbery in ysr district | Sakshi
Sakshi News home page

కారు అద్దాలు పగలగొట్టి రూ.50 వేల చోరీ

Apr 11 2016 1:37 PM | Updated on Aug 30 2018 5:27 PM

కారు అద్దాలు పగలగొట్టి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లాడో ఆగంతకుడు.

బద్వేల్ : వైఎస్సార్ జిల్లా బద్వేల్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చోరీ జరిగింది. కారు అద్దాలు పగలగొట్టి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లాడో ఆగంతకుడు. మైదుకూరు రోడ్డులోని మధువైన్స్ యజమాని కొర్రపాటి సురేంద్ర ఎస్‌బీఐలో జమ చేసేందుకురూ.3 లక్షలు తెచ్చాడు.

కారులో ఉంచి పక్కనే ఉన్న ఓ హోటల్‌లో కూర్చుని స్నేహితునితో మాట్లాడుతున్నాడు. విషయం గమనించిన ఆగంతకుడు కారు అద్దాలు పగలగొట్టి డబ్బులు చోరీ చేశాడు. కొంద డబ్బు సీటు కిందపడిపోవటంతో అవి అందలేదు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement