రైతులకు చెల్లించాల్సిన పాత, కొత్త బకాయిలు మే 5 లోపు చెల్లించకపోతే జాతీయ రహదారిని దిగ్బంధనం చేస్తామని సోమవారం రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు.
విజయనగరం (పార్వతీపురం) : రైతులకు చెల్లించాల్సిన పాత, కొత్త బకాయిలు మే 5 లోపు చెల్లించకపోతే జాతీయ రహదారిని దిగ్బంధనం చేస్తామని సోమవారం రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. వివరాల ప్రకారం.. సీతానగరం మండలం లచ్చయ్యపేటలోని ఎన్‌సీఎస్ ఘగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం.. రైతులకు సుమారు రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది.
దీనికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు, అధికారుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బకాయిలు ఈ నెలాఖరులోగా చెల్లించాలి. కానీ ఇప్పటివరకు రైతులకు ఎలాంటి చెల్లింపు జరుగలేదు. కాగా వచ్చే నెల 5వ తేదీ లోపు చెల్లించకపోతే మే 8న జాతీయ రహదారి దిగ్బంధనం చేస్తామని రైతులు ఆర్డీఓ గోవిందరావుకు స్పష్టం చేశారు. ఆర్డీవోను కలిసిన వారిలో రైతు సంఘాల నాయకులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కూడా ఉన్నారు.