
రూ. 15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం తూమకుంట వద్ద అటవీశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు.
కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలం తూమకుంట వద్ద అటవీశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం లోడుతో వెళ్తున్న లారీని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని... సీజ్ చేశారు. అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అటవీశాఖ కార్యాలయానికి తరలించి అటవీశాఖ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.