
సాక్షి, విజయవాడ: రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్‌పై నగర బహిష్కరణ వేటు పడింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మంగళవారం అతన్ని నగరం నుంచి ఆరునెలల పాటు బహిష్కష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూసఫ్ పఠాన్‌పై ఇదివరకే గన్నవరం పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైంది. అతని నేరప్రవృత్తిలో ఎంతకూ మార్పు రాకపోవడంతో పోలీసులు అతడిపై బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఇప్పటికే ఇద్దరు రౌడీ షీటర్లను విజయవాడ నుంచి బహిష్కరించారు. ఈ వరుస బహిష్కరణల పర్వం రౌడీ షీటర్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. (విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు)