విజయనగరం జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది.
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది. పట్టణంలోని రంజనీ థియేటర్ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాంచైజీలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడిరూ. 40 వేల నగదు, రూ. 45 వేల విలువ చేసే రీచార్జ్ కార్డులు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై శనివారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు.