వృద్ధుల అగచాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు పింఛన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందని అటు పంచాయతీ అధికారులు, పోస్టల్ అధికారులు చెబుతున్నప్పటికీ పింఛన్లు అందక రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
వేంపల్లె : వృద్ధుల అగచాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు పింఛన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందని అటు పంచాయతీ అధికారులు, పోస్టల్ అధికారులు చెబుతున్నప్పటికీ పింఛన్లు అందక రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళవారం అధికారులు సమయానికి రాక పింఛన్లు పంపిణీ జరుగకపోవడంతో వృద్ధులు రోడ్డుపై భైఠాయించారు. ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, పోస్టుమాస్టర్ శశిధర్‌రెడ్డి జోక్యం చేసుకుని పోస్టాఫీసువద్దకు వచ్చి పింఛన్ల పంపిణీ చేపట్టడంతో సమస్య సద్దుమణిగింది. శివరాత్రి సెలవుదినం అయినప్పటికీ పింఛన్లు పంపిణీ చేస్తామని వృద్ధులకు సీరియల్ నంబర్లు వేసి స్లిప్పులు అందించారు.
అక్కడికి చేరుకున్న వృద్ధులు సిబ్బంది రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై భైఠాయించారు. వార్డు మెంబర్ మణిగోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కటిక చంద్ర, ఉప సర్పంచ్ మునీర్ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, పోస్టుమాస్టర్ శశిధర్‌రెడ్డి, ఈవో షాకీర్ ఆలీఖాన్, సిబ్బంది పింఛన్ల పంపిణీ కొనసాగించారు.