చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం అప్పినేపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం అప్పినేపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పుంగనూరుకు చెందిన ఆర్మీ రిటైర్డు ఉద్యోగి చంద్రశేఖర్‌రాజు(52) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అప్పినేపల్లి మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన పడి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలికి చేరుకుని, బంధువులకు సమాచారం ఇచ్చి కొన ఊపిరితో ఉన్న చంద్రశేఖర్‌రాజును వెంటనే వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి తీసుకెళ్లారు.