హైదరాబాద్‌లోనిషేధాజ్ఞల పొడిగింపు | restrictions continue in hyderabad: Anurag Sharma | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోనిషేధాజ్ఞల పొడిగింపు

Sep 20 2013 8:42 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లోనిషేధాజ్ఞల పొడిగింపు - Sakshi

హైదరాబాద్‌లోనిషేధాజ్ఞల పొడిగింపు

రాష్ట్ర రాజధాని నగరంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను మరో వారం పాటు పొడిగిస్తూ కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర రాజధాని నగరంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను మరో వారం పాటు పొడిగిస్తూ కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం జంట నగరాల పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.

సచివాలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో మైకులు, నినాదాలు నిషిద్ధం. మారణాయుధాలు, నిషేధిత వస్తువులతో పాటు ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని తిరగకూడదు. ఈనెల 28 వరకు అములో ఉండే ఈ నిషేధాజ్ఞలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement