ఓవైసీపై పోటీ చేయడం లేదు: రాంగోపాల్ వర్మ
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ పై పోటీ చేయడం లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ పై పోటీ చేయడం లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేయనున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను వర్మ ఖండించారు.
మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఓవైసీల హవాకు గండి కొట్టేందుకు శివసేన తరపున వర్మను బీజేపీ బరిలోకి దింపుతోందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
'చిరంజీవి హటావో, దేశ్ కో బచావో' అంటూ వర్మ చేసిన ట్వీట్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి బలానిచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా వర్మ బహిరంగంగా మద్దతు తెలుపడం, ప్రస్తుత రాజకీయాలపై వేగంగా స్పందించడంతో రాజకీయాల్లోకి ప్రవేశేసిస్తున్నారా అనే సందేహాలు కలిగాయి. అయితే ఓవైసీపై పోటికి దిగడం లేదని చేసిన ట్విట్ కొంత గందరగోళాన్ని తగ్గుముఖం పట్టించే అవకాశం ఉంది.